ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

రిపోర్టర్: రమేష్ స్థలం: Washington

హర్మూజ్ జలసంధిని తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖరాఖండీగా తిరస్కరించారు. ఘోర ఓటమిని చవిచూస్తున్న టెహ్రాన్ ప్రస్తుతం ఒక ఒప్పందం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఆయన తెలిపారు. ఆ డీల్లోని షరతులు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ఓడరేవులపై తాము చేపట్టిన నౌకా దిగ్బంధనం ఆ దేశంపై తీవ్ర ఆర్థిక ఒత్తిడిని పెంచుతోందని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.