పెట్రోల్ బంకుల్లో రెండు వేల పైన యూపీఐ చెల్లింపులకు కొత్త చిక్కులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: భారతదేశం
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం అక్టోబర్ పదిహేను నుంచి రెండు వేల రూపాయలకు మించి జరిగే డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించనుంది. దీనివల్ల పెట్రోల్ బంక్ యజమానులపై అదనపు భారం పడుతుండటంతో కొన్ని చోట్ల నగదు చెల్లించాలని కోరే అవకాశం ఉంది.