శిశు ఆహార ఉత్పత్తులపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కఠిన నిబంధనలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ముంబై
శిశువుల ఆహార ఉత్పత్తులపై మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ మండలి కఠిన మార్గదర్శకాలను జారీ చేసిందని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారామ్ ముండే తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. తప్పుడు ప్రకటనలు, సోషల్ మీడియా ప్రమోషన్లు, ఉచిత నమూనాల పంపిణీని పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ప్రతి ప్యాకెట్‌పై తల్లిపాలతో పాటు హెచ్చరిక బోర్డులను స్పష్టంగా ముద్రించాలని స్పష్టం చేశారు.