తిరుపతిలో స్టాప్ అండ్ వాష్ ప్రత్యేక కార్యక్రమం

రిపోర్టర్: సురేష్ స్థలం: Tirupati

రోడ్డు భద్రతలో భాగంగా తిరుపతి పోలీసులు స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్ మరియు బాధ్యతాయుతమైన ప్రయాణంపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు.