ఓటర్ల జాబితా పక్కాగా రూపొందించాలని సుదర్శన్ రెడ్డి హుకుం

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో ఎస్ఐఆర్-2026 ఓటర్ల జాబితా సవరణను నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఏఎస్డీ, డిలీషన్ జాబితాలను పరిశీలించి ఫారం-6, 7, 8 దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని సూచించారు. నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షకు స్పష్టం చేశారు.