బాలీవుడ్లో బ్రేకప్ కలకలం: విడిపోయిన ఇబ్రహీం అలీఖాన్, పాలక్ తివారీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: ముంబై

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్, నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ తమ రిలేషన్షిప్కు ముగింపు పలికినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఇద్దరూ విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని సమాచారం.