ద్వార్కా ఎక్స్ ప్రెస్ వే వద్ద మోటార్ సైకిల్‌ను ఢీకొన్న థార్ వాహనం
రిపోర్టర్: సునీల్
స్థలం: గురుగ్రామ్
గురుగ్రామ్ లోని ద్వార్కా ఎక్స్ ప్రెస్ వే సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక నల్లటి థార్ కారు అతివేగంగా, అజాగ్రత్తగా దూసుకొచ్చి బైక్ ను ఢీకొట్టిందని, ఈ ఘటన డాష్ క్యామ్ లో నమోదైందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో పరారయ్యాడని, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు.