ఆస్ట్రేలియాలో కలకలం: భారతీయులను లక్ష్యంగా చేసుకుని జాత్యహంకార స్టిక్కర్ల ప్రచారం
రిపోర్టర్: సతీష్
స్థలం: సిడ్నీ
ఆస్ట్రేలియాలోని సెస్నాక్ ప్రాంతంలో భారతీయులను కించపరిచేలా వెలుగులోకి వచ్చిన జాత్యహంకార స్టిక్కర్ల ప్రచారం తీవ్ర కలకలం రేపుతోందని ఫెడరల్ ఎంపీ డాన్ రెపచోలీ తెలిపారు. భారతీయుల సంస్కృతిని అవమానించేలా, వలసదారులను వెనక్కి పంపాలనే నినాదాలతో వెలసిన ఈ స్టిక్కర్లపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ఇటువంటి అసాంఘిక చర్యలను సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.