గుజరాత్లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన ప్రిన్సిపాల్ అరెస్ట్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Kutch

గుజరాత్ కచ్ జిల్లాలోని రాపడ్ తాలూకాలో గల రెసిడెన్షియల్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల మైనర్ బాలికపై ప్రిన్సిపాల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాపడ్ పోలీసు ఇన్స్పెక్టర్ ఆర్ ఎల్ ఖట్టానా వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్తో పాటు మరో ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు.