మీనాక్షి ఎలిసియా భవన నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రశ్నలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
చారిత్రక మొజంజాహి మార్కెట్ ప్రాంతంలో చేపట్టిన ముప్పై ఐదు అంతస్తుల మీనాక్షి ఎలిసియా భవన నిర్మాణ ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక ప్రశ్నలు లేవనెత్తిందని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కొరీనా సువారెస్ వెల్లడించారు. అబిడ్స్ ప్రాంతం నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ భారీ భవనం డ్రోన్ దృశ్యాలు ఆ ప్రాంతం యొక్క స్కైలైన్ను పూర్తిగా మార్చివేశాయని కోర్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు అనుమతులు మరియు చట్టబద్ధతపై న్యాయస్థానం స్పష్టత కోరిందని ఆమె తెలిపారు.