తండ్రి స్మారకార్థం సచిన్ టెండూల్కర్ కీలక ఫెలోషిప్ ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: India

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన తండ్రి రమేష్ టెండూల్కర్ స్మారకార్థం 'ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్'ను ప్రకటించారు. క్లెఫ్ట్, క్రానియోఫేషియల్ కేర్‌లో ప్రత్యేకత సాధించే వైద్యులకు ఇది ఆర్థిక సాయం అందిస్తుంది. "ఓటమిని అంగీకరించండి కానీ మోసం చేయకండి, షార్ట్‌కట్‌లు వద్దు" అని తన తండ్రి నేర్పిన విలువలే తనను తీర్చిదిద్దాయని సచిన్ భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. శ్రీనగర్‌లో ఈ వైద్య శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది.