హస్తకళతో ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదుగుతున్న ఒడిశా మహిళలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Odisha

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా ఖైరా ప్రాంతానికి చెందిన 25 మంది మహిళలు చందువా హస్తకళ ద్వారా స్వయం ఉపాధి సాధిస్తున్నారు. మా షర్లా ప్రొడ్యూసర్ గ్రూప్ ఆధ్వర్యంలో అందమైన బ్యాగులు, అలంకరణ వస్తువులు తయారు చేస్తూ నెలకు స్థిరమైన ఆదాయం ఆర్జిస్తున్నారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తూ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.