వృద్ధాశ్రమానికి దాతల అండగా నిలిచిన జగన్నాథరెడ్డి దంపతులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఏర్పేడు

ఏర్పేడు మండలం వికృతమాల సమీపంలోని ఆదర్శ నిలయం వృద్ధాశ్రమాన్ని వెదురుకుప్పం మండలానికి చెందిన ఎన్ఆర్ఐ బండి జగన్నాథ రెడ్డి, డాక్టర్ స్వర్ణ రెడ్డి దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రయానికి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పేదరికంతో ఇబ్బంది పడుతున్న మెరిట్ విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్ ఉచితంగా చదివిస్తామని జగన్నాథ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.