గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు: హర్యానాలో నిందితుడు షేక్ జాన్ అరెస్ట్
రిపోర్టర్: విజయ్
స్థలం: గుంటూరు
గుంటూరులో 10వ తరగతి బాలికను కిడ్నాప్ చేసిన షేక్ జాన్ సైదాను హర్యానాలోని కర్నాల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై బాలికను తీసుకెళ్లిన నిందితుడిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకుని బాలికను సురక్షితంగా రక్షించారు. రేపు బాలికను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై గతంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.