శ్రీకాళహస్తి ప్రభుత్వ కళాశాలలో ఘనంగా సాగిన వాల్మీకి జయంతి ఉత్సవాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాళహస్తి
రామాయణం భారతీయుల జీవితాలకు ధర్మ మార్గాన్ని చూపించిన గొప్ప గ్రంథమని, ఆదికావ్యాన్ని అందించిన వాల్మీకి మహర్షి సేవలు చిరస్మరణీయమని ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. బి. వాణిశ్రీ తెలిపారు. శ్రీకాళహస్తి ఎస్వీఏ ప్రభుత్వ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సోమవారం వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాల్మీకి చిత్రపటానికి నివాళులు అర్పించారు.