తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా యంత్రాంగం పూర్తి ప్రక్షాళన

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. టీపీసీసీ సోషల్ మీడియా కొత్త చైర్మన్ నవీన్ పెట్టెం నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 670 మండలాలకు నూతన సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమిస్తున్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఈ డిజిటల్ ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.