విశాఖలో తీవ్ర నీటి ఎద్దడిపై కూటమి ప్రభుత్వంపై విమర్శలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Visakhapatnam

విశాఖపట్నంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రజలు గుంట నీటితో ఇబ్బందులు పడుతుంటే ప్రైవేట్ ట్యాంకర్ల మాఫియా దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. నీటి కొరతను ఆసరాగా చేసుకుని ట్యాంకర్ నిర్వాహకులు ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని, ప్రభుత్వ పాలనలో ప్రజలు తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారని ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.