ఎన్నికల సంఘం తీరుపై రాహుల్ గాంధీ నిప్పులు: సీఈసీ జైలుకు వెళ్లడం ఖాయమని ఫైర్
రిపోర్టర్: మహేష్
స్థలం: ఢిల్లీ
ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించి జైలుకు పంపుతామని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్ లో ఈవీఎంలు, ఓటర్ల జాబితా ట్యాంపరింగ్ ద్వారా ఓట్లు చోరీ చేశారని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి భారీ బహిరంగ సభలో ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దొంగతనం దేశంలోని ప్రతి గొంతును అణచివేయడమేనని ఆరోపించారు.