బెల్లంపల్లి 34వ వార్డులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని 34వ వార్డులో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ సందడి చేశారు. గౌరమ్మకు పూజలు నిర్వహించి వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా జరిగిన ఈ సంబరాలు స్థానికంగా విశేషంగా ఆకట్టుకున్నాయి.