రాజాపేట పోలీస్ స్టేషన్లో ఘనంగా ఆయుధ పూజ నిర్వహించిన అధికారులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో దసరా పండుగ సందర్భంగా ఎస్ఐ తఖియుద్దిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆయుధ పూజ మరియు వాహన పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని దేవునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని కోరారు.