పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలగించిందని అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా పింఛన్లు ఆగుతాయని ఆందోళన చెందుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ నిర్ణయంతో భారీ ఊరట లభించింది. పాత లబ్ధిదారులకు మాత్రమే నేరుగా నిధులు అందుతాయని స్పష్టం చేస్తూ, కొత్త పేర్లను జాబితాలో చేర్చకూడదని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది.