మంగళగిరిలో టీడీపీలోకి భారీ చేరికలు: మంత్రి నారా లోకేష్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న సీపీఎం, వైసీపీ నేతలు
రిపోర్టర్: రమేష్
స్థలం: మంగళగిరి
మంగళగిరి నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీపీఎం, వైసీపీ పార్టీల నుంచి వచ్చిన సుమారు రెండు వందల కుటుంబాలకు ఆయన సాదరంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా నారా లోకేష్ స్పష్టం చేశారు.