బీజేపీ డంపింగ్ యార్డు కాదు: కొండా సురేఖ చేరికపై మురళీధర్ రావు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీజేపీలో చేరుతారన్న ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్ నేత పి. మురళీధర్ రావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఏమాత్రం చెత్తకుప్ప కాదని, ఇతర పార్టీల అసంతృప్త నేతలకు ఇది డంపింగ్ యార్డు కాకూడదని ఆయన స్పష్టం చేశారు. సొంత బలంతో ఎదగడమే తమ లక్ష్యమని, వలస నేతలపై ఆధారపడబోమని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో సురేఖ చేరికపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.