కల్వకుర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయానికి ఆధ్యాత్మిక పుస్తకాల అందజేత

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయానికి ప్రజాకవి కర్నాటి రఘురాములుగౌడ్ రచించిన శ్రీ వేంకటేశ్వర స్తుతి పుస్తకాలను శుక్రవారం అందజేశారు. ఆధ్యాత్మికత, సన్మార్గం, విద్య గొప్పతనాన్ని ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్గౌడ్, డాక్టర్ రాజు, జగదీశ్వర్రెడ్డితో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.