పరిహారం కోసమే శాత్రాజ్‌పల్లిలో అక్రమ నిర్మాణాల జోరున్నట్లు స్థానికుల ఆందోళన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: జయశంకర్ భూపాలపల్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల పంచాయతీ శాత్రాజ్‌పల్లిలో సింగరేణి పరిహారం కోసం అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. తాడిచర్ల బ్లాక్-2 ఉపరితల గని ఏర్పాటు నేపథ్యంలో గ్రామం స్వాధీనమైతే పునరావాస ప్యాకేజీతోపాటు నష్టపరిహారం వస్తుందనే ఆశతో అక్రమార్కులు ఇండ్లు నిర్మిస్తున్నారు. గతంలో 49 ఇళ్లు మాత్రమే ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 600కు చేరుకోవడం గమనార్హం. ఫారెస్ట్ అధికారులు ఒక్కో ఇంటికి రూ.10వేలు వసూలు చేస్తూ ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.