హుస్నాబాద్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మార్కండేయ ఆలయ ప్రాంగణంలో మండల పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ తొలితరం ఉద్యమకారుడిగా, బహుజనుల హక్కుల పోరాట యోధుడిగా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.