నేపాల్, బంగ్లాదేశ్ తరహా అశాంతి దేశానికి ప్రమాదకరమంటూ ఎంపీ గోడం నగేశ్ ఆందోళన
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆదిలాబాద్
నేపాల్ మరియు బంగ్లాదేశ్ దేశాలలో చోటుచేసుకున్న పరిణామాలు, హింసాత్మక ఘటనల తరహాలోనే భారతదేశంలో కూడా పాలన మార్పు, అరాచకం సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ గోడం నగేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విప్లవాల పేరుతో జరుగుతున్న హింస, నినాదాల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను ప్రతి ఒక్క భారతీయుడు నిశితంగా గమనించాలని ఆయన స్పష్టం చేస్తూ, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ప్రమాదకర ధోరణులను అందరూ తీవ్రంగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.