వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు
రిపోర్టర్: రాము
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ కలకలం రేగింది. సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో స్థానిక రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగి, ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఆయన, ఇప్పుడు పార్టీని వీడటంపై తీవ్ర చర్చ జరుగుతోంది. తదుపరి రాజకీయ భవిష్యత్తుపై ఆయన తన అనుచరులతో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.