ఎన్నికల నిబంధనలు పాటించాలి: రాజకీయ పార్టీలకు శ్రీకాకుళం పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీకాకుళం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్డివిజన్ల పరిధిలోని అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఎన్నికల ప్రచారంలో కచ్చితంగా నియమావళి పాటించాలని శ్రీకాకుళం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహణ జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని వారు కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.