భారతీయ రైతుల కష్టానికి తగిన ధర దక్కుతోందా అంటూ వినోద్ ఆవేదన
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
నార్వే సూపర్ మార్కెట్లలో కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయని, భారత్లో అన్నదాతలకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర అందుతోందా అని వినోద్ అనే ప్రవాస భారతీయుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నార్వేలో కిలో నిమ్మకాయల ధర రూ. 850 వరకు ఉండగా, మన దేశంలో మాత్రం కేవలం రూ. 90 నుంచి రూ. 110 మధ్యే ఉందని ఆయన తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం వల్ల వినియోగదారులు చెల్లించే సొమ్ము రైతులకు దక్కడం లేదని పలువురు నెటిజన్లు ఆందోళన వెలిబుచ్చారు.