సెప్టెంబర్ పదిహేళవ తేదీని అధికారికంగా జరపాలని నేతల డిమాండ్

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వర్ధన్నపేట మండల బీజేపీ అధ్యక్షుడు అడుప రాజు శుక్రవారం స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఎంతో ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ఈ రోజు ప్రాముఖ్యతను నేటి తరానికి, ముఖ్యంగా యువతకు తెలియజేసేలా ప్రభుత్వమే స్పష్టమైన నిర్ణయం తీసుకుని, అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.