రాయదుర్గంలో శేరిలింగంపల్లి ఇందిరమ్మ టవర్స్‌కు రేపు భూమిపూజ
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
హైదరాబాద్: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు చేతుల మీదుగా భూమిపూజ జరగనుందని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. రూ. 43.20 కోట్ల వ్యయంతో 4 టవర్లలో మొత్తం 480 ఫ్లాట్లను ఆధునిక వసతులతో ఏడాదిలో పూర్తిచేసి, లబ్ధిదారులకు అందజేయనున్నారు.