వైసీపీకి భారీ షాక్: తోటపల్లిగూడూరులో టీడీపీలోకి వందలాది కుటుంబాలు

రిపోర్టర్: sujith reddy స్థలం: తోటపల్లిగూడూరు

నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడిలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సొసైటీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసే ప్రజలు భారీగా పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు.