భారీ వర్షాల ముప్పు: చెన్నై, తిరువల్లూరులో విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
రిపోర్టర్: కిరణ్
స్థలం: Chennai
మురసు తుఫాను ముప్పు పొంచివున్న నేపథ్యంలో తమిళనాడులోని చెన్నై మరియు తిరువల్లూరు జిల్లాల్ లో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు చెన్నై జిల్లా కలెక్టర్ అధికారికంగా వెల్లడించారు. భారత వాతావరణ శాఖ ఇచ్చిన భారీ వర్షాల హెచ్చరికల మేరకు విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఏడు జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర విపత్తి నిర్వహణ శాఖ తెలిపింది.