ప్రాణాపాయంలో ఉన్న రోగులకు అండగా: బిహార్ యువకుల రక్తదాన సేవల విశేషాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: నలందా

దేశ సరిహద్దుల్లో పోరాటమే కాకుండా రక్తం అందక చావుబతుకుల మధ్య ఉన్నవారిని కాపాడటం కూడా గొప్ప దేశసేవే అని నిరూపిస్తున్నారు బిహార్కు చెందిన కొందరు యువకులు. తండ్రి మరణం రగిల్చిన ఆవేదనతో కమ్రాన్ అష్రఫీ స్థాపించిన నలందా బ్లడ్ గ్రూప్ నెట్వర్క్ ఇప్పుడు దేశ విదేశాలకు విస్తరించి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతోందని నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా పగలూ రాత్రి తేడా లేకుండా వీరు అందిస్తున్న సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి.