వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, వైద్యశాఖ అధికారులు తదితరులు పాల్గొని పనుల పురోగతిని సమీక్షించారు.