శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం నలుగురు విద్యార్థులు మృతి
రిపోర్టర్: సునీల్
స్థలం: Tekkali, Srikakulam
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళుతున్న ఐదుగురు విద్యార్థులను రాజ్యరాణి రైలు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బహిర్భూమికి వెళ్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.