పట్టిసీమపై జగన్ వ్యాఖ్యలు: లక్ష కోట్ల సంపద సృష్టించారంటూ కాకర్ల సురేష్ కౌంటర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నాడు పట్టిసీమ ప్రాజెక్టును వట్టిసీమ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ వేదికగా రూ.1,600 కోట్లు వృథా చేశారంటూ విషం చిమ్మి విమర్శించారని, నేడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాను కాపాడుతూ పదేళ్లలో దాదాపు లక్ష కోట్ల రూపాయల సంపదను సృష్టిస్తోందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రాంతానికి చెందిన కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు లేకపోతే కృష్ణా డెల్టాలో పంటలు పండని దయనీయ పరిస్థితి నెలకొనేదని ఆయన స్పష్టం చేస్తూ ఘాటైన విమర్శలు గుప్పించారు.