ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్న సీపీ అంబర్ కిషోర్ ఝా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సుల్తానాబాద్

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదగా వ్యవహరించి నాణ్యమైన సేవలు అందించాలని స్పష్టం చేశారు. రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు, రౌడీషీటర్లపై నిఘా మరియు రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.