'రాహుల్ గాంధీకి ఒక రూల్.. బీఆర్‌ఎస్‌కు మరో రూలా?': రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

రాహుల్ గాంధీకి ఒక రూల్, బీఆర్‌ఎస్‌ నాయకులకు మరో రూలా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎంపై మాట్లాడితే మైక్ ఇవ్వనని అసెంబ్లీలో స్పీకర్ అనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆరు గ్యారెంటీలు, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ బాధ్యతని, మంత్రుల అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.