సైనిక లాంఛనాలతో ముగిసిన జవాన్ కేశవరెడ్డి అంత్యక్రియలు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: వేంపల్లి
వైయస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం దుగ్గనగారిపల్లె గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కేశవరెడ్డి కరెంట్ షాక్ కారణంగా అకాల మృత్యువు చెందారు. ఆయన భౌతికకాయానికి స్వగ్రామంలో శనివారం ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ దుర్ఘటనపై పలువురు నాయకులు, సైనిక సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.