తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి తప్పని అంతర్గత సవాళ్లు

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్ పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న వేళ, రేవంత్ రెడ్డి సర్కారుపై అంతర్గత ఒత్తిడి పెరుగుతోంది. మంత్రుల మధ్య సమన్వయ లోపం, ప్రాజెక్టుల గడువుపై భిన్న ప్రకటనలు ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారాయి. కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చి, మంత్రులను ఏకతాటిపైకి తెచ్చి పాలనపై పట్టు సాధించడం రేవంత్ రెడ్డికి ఇప్పుడు అత్యంత కీలకం.