'బీజేపీతో పొత్తు లేదు': బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పష్టత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హర్యానా
తెలంగాణలో రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హర్యానాలోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన ప్రత్యేక ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం స్థానాలను పెంచితే లోక్సభ స్థానాల పునర్విభజనకు మద్దతు ఇస్తామని తెలిపారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాధించిన విప్లవాత్మక అభివృద్ధిని ఆయన ఈ సందర్భంగా వివరించారు.