దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం: 8 ఎక్స్ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు
రిపోర్టర్: విజయ్
స్థలం: India
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే 8 ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాల్లో మార్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే ఈ రైళ్ల కొత్త వేళలు నవంబర్ మొదటి వారం నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యం, నిర్వహణ సామర్థ్యం పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికులు గమనించగలరు.