పాఠశాలకు పుస్తకాల విరాళం: కడ్తాల్ బాయ్స్ హైస్కూల్లో లయన్స్ క్లబ్ సేవ

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

కడ్తాల్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం లైబ్రరీ పుస్తకాలు మరియు రెండు ర్యాక్స్ను అందజేశారు. పుస్తక పఠనంతో విద్యార్థుల్లో జ్ఞానం, ఆలోచనా శక్తి పెరుగుతాయని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పుస్తకాలు అందించిన వారిని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.