తిరుమలలో కీలక నిర్ణయం: బ్రహ్మోత్సవాల వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తిరుమల

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దడిని నియంత్రించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల పదకొండో తేదీ నుంచి ఇరవయ్యవ తేదీ వరకు ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐల ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రేపు ఉదయం ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.