వాహనదారును బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిపై కేసు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్ల వద్ద వాహనదారుడిని అడ్డుకుని పశువుల రవాణా పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా నుంచి పశువులను తరలిస్తుండగా ముగ్గురు నిందితులు బైక్‌లపై వచ్చి రూ.రెండు వేలు ఫోన్‌పే చేయించుకున్నారు. బాధితుడు సాయిచరణ్‌ ఫిర్యాదు మేరకు కే.రాజీవ్, తెరిపల్లి ఆనంద్‌కుమార్, అప్పారావులపై సీఐ మురళి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.