మహిళా శక్తితోనే వికసిత్ భారత్ సాకారం: జాతీయ సరస్ మేళాలో చంద్రబాబు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Vijayawada
మహిళా శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటేనే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మహిళలు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాదని, సంపద సృష్టికర్తలుగా ఎదుగుతున్నారని కొనియాడారు. త్వరలో రాష్ట్రంలో పది లక్షల మంది ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వెల్లడించారు.