మొక్కల సంరక్షణపై పాలకుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన బీఎస్పీ నేత
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హరితహారం మరియు వనమహోత్సవం కింద నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఏటా మొక్కలు నాటుతున్నప్పటికీ ఎండిపోవడం, పశువులు తినడం వల్ల అనేక మొక్కలు నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కలు నాటే ముందు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, విద్యుత్ తీగల కింద నాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని మున్సిపల్ అధికారులను కోరారు.