పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరుపై మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఫైర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
ఇంగ్లాండ్‌తో సిరీస్ మధ్యలో ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లను తొలగించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టును రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్నారని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మండిపడ్డారు. కోచ్‌లకు, కెప్టెన్‌కు అధికారం లేకపోతే వారిని ఎందుకు పంపారని ప్రశ్నించారు. బాబర్ ఆజామ్ మాట వినకపోతే కెప్టెన్‌ను తొలగించాలి కానీ, కోచ్‌లను ఇంటికి పంపడం ఏంటని లతీఫ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.